Saturday, 30 December 2017

గజల్..2016--అందమెంతో..

చిత్రకవితా మంజరి...తెలుగు గజల్...రచన.డా. శ్యామలగడ్డం.....28.12.2016...
+++++++++++++++++++++++++++++++

జాబిలమ్మతొ  ముద్దుమోమూ  పంతమాడిన  అందమెంతో

ఆకసమ్ము తొ  నీలివసనము  ఆటలాడిన   అందమెంతో

పిల్లతెమ్మర  వాతెరల్లో  ధవళకాంతుల. సందడెంతో

కలువకన్నుల   వీక్షణములతొ.  నిరీక్షించిన.  అందమెంతో

మయూరాన్నే   చెలిగ చేసీ.  రాసియుండిన   లేఖలెన్నో

ప్రియుని చేరా   రాయబారిగ   చేసియుండిన   అందమెంతో

వియోగాలా.  జలధిలోనా  తీరమెక్కడ. తెలియకున్నా

మరులు గొలిపే.  లేఖలెన్నో.  రాసియుండిన   అందమెంతో

శ్యామ తెలిపే   ఊసులన్నీ. కొంటెకృష్ణుని   చిలిపిచేష్టలు

తొందరించిన   మనసునెంతో    ఆపియుండిన  అందమెంతో..

.

డా. శ్యామలగడ్డం....28-12-2016....

+++++±++++++++++++++++++++++++++

No comments:

Post a Comment