Tuesday, 17 May 2016

16. ప్రియసఖీ...02-04-16...

గజల్ మహల్ 14.... శ్యామలగడ్డం..
2.4.2016

నీ మానస చోరుడినే... మన్నించవె ప్రియసఖీ
నీ అడుగుల సవ్వడినే...కరుణించవె ప్రియసఖీ

నీ పాటల తోటనేను..పరిమళించు మొగ్గ నీవు
నీ మాటల జడినినేను..మురిపించవె ప్రియసఖీ

నీ భావన రాగముగా..రసజీవన వేదముగా
నీ అందెల మువ్వనుగా..నటియించవె ప్రియసఖీ..

నీ అలికిడి నాశ్వాసగ.. తపియించితి నీ కొరకే
నీ పిలుపుకి లేఖనైతి ..గ్రహియించవె ప్రియసఖీ

నీ జీవన గమనముగా.. నీ తోడుగ నేనుండగ
నా మనసున మల్లెగాను ..పుష్పించవె ప్రియసఖీ.,.

శ్యామలగడ్డం.... 02.04.2016..