చిత్ర కవిత్వం..2.. 09-11-2016...
నింగినున్న చందమామ వచ్చెనేమొ భామినిగా
శంపాలత కొనలుసాగి వచ్చెనేమొ భామినిగా
రాయంచల హొయలుచూసి నీవేనని అనుకున్నా
అప్సరసే విరహముతో వచ్చెనేమొ భామినిగా
రవివర్మకె అందనంత అందమంత నీదేలే
తిలోత్తమే తలోదరిగ వచ్చెనేమొ భామినిగా
రమణీయా రసాకృతివి నీవుగాక మరియెవరూ
వరూధినియె వరుని వెతక వచ్చెనేమొ భామినిగా
తారకలే తమితీరక. నీ మాదిరి వచ్చెనేమొ
మేనకనే మరపించగ వచ్చెనేమొ భామినిగా..
డా. శ్యామలగడ్డం...09-11-2016....