Monday, 1 January 2018

గజల్...నా ప్రేయసి....2016

విరహాలను అగ్గిపూలు వెదజల్లకె నా ప్రేయసి
ప్రణయాలను రాగమాల మెడనేయవె నా ప్రేయసి

ఉషోదయపు రవి కాంతుల నీ తనువే మెరసిపోగ
ఉదయించిన జాబిల్లే నీ వదనమె నా ప్రేయసి

కమ్మనైన పికముపాట నీ గళమై వినిపించగ
మదినుండే మమతలేమొ పొంగి పొరలె నా ప్రేయసి

కొండ కోన శబ్దించగ నీ పలుకులె అనుకున్నా
సెలయేరుగ నీ నవ్వే భ్రమియించితె నా ప్రేయసి

కరి మబ్బుల దారివెంట భ్రమరములే వరుస కట్ట
నీలిమబ్బు చాటుకురులు దరిశించితె నా ప్రేయసి...

డా. శ్యామల గడ్డం....02-01-2016