చిత్రానికి గజల్ రచన- చిరు యత్నం..06-07-2018...
++++++++++++++++++++++++
అరమోముతొ చందురునీ హాసములో చూపుదువే...
ముద్రలతో ఆంగికములు ,అభినయములు చూపుదువే..
రంగస్థలమున రాగిణిగ హొయలెన్నో కురిపించీ...
అవని పైన అప్సరసా...అతిశయములు చూపుదువే....
నటరాజు ను మెప్పించీ మోక్షమునే కోరుదువో..
సిరిమువ్వలు ఘల్లుమనగ సందడులూ చూపుదువే...
రంభ ఊర్వశి మేనక లు నీముందూ బలాదూరె...
రసానందము గొలుపగ , లలిత కళలు చూపుదువే.
శ్యాముమురళి విన్నంతనె నాగిని వలె ఆడుదువే...
సరిగమలకు సానపెట్ట సంగతులూ చూపుదువే...
డా.శ్యామలగడ్డం...06-07-2018