Thursday, 31 May 2018

గజల్...30-05-2018

గజల్ ముషాయిరా......రచన..డా.శ్యామల గడ్డం.....30-05-2018..
+++++++++++++++++++++++++++++++++

కలలోన నీ రూపె  కదులుతూ ఉంటుంది..

మంత్రమై నీపేరు నిలుస్తూ ఉంటుంది,...

నీ ఊహ క్షణమైన కలిగితే చాలులే..
నా మనసు జడముగా మారుతూ ఉంటుంది....

నీ కనుల భాష్యాలు చదివితే చాలులే..
నా హృదయ రాగమూ పలుకుతూ ఉంటుంది..

ఆమనీ కోయిలా  పాడితే తీయగా,
నీ గీత మాధురీ తడుముతూ ఉంటుంది..

నీ వలపు తలపులే తలుపులే తీయగా..
మాటలే కవితయై పారుతూ ఉంటుంది..

విరహాగ్ని పొగలోన నీ రూపె కనబడదు.
ప్రేమతో వర్షించ తొలగుతూ (పొగ)ఉంటుంది...

డా.శ్యామల గడ్డం.....30-05-2018

Wednesday, 2 May 2018

Ghazal canvas sameeksha..02-04-2018..

గజల్ సమూహ సభ్యులకు గజల్ ప్రేమా కవులకు శుభము మధ్యాహ్నం....

గతవారం అంటే 27-04-2018 గజల్ కాన్వాస్ శీర్షిక లో ఇచ్చిన చిత్రానికి అద్భుతమైన స్పందన వచ్చింది.  మది గదిలో దాచుకోదగిన గజల్స్ ఎన్నో గజల్ కవిమిత్రుల కలాలనుండి జాలువారాయి...అందరికీ ధన్యవాదాలు..

     సమీక్ష.
++++++++

  చిత్రం అమ్మ బొమ్మ..అమ్మ చెంత పాపాయి...ఇక షేర్ల వరదకు అడ్డేంటీ....అమ్మ ప్రేమ కొనలేనిది, అనంతమైనది..
అపూర్వమైన ది.అసాధారణమైనది. ప్రతీ తల్లి నాకు నా బిడ్డపై ఉన్నప్రేమ మరి ఎవ్వరికీ ఉండదు.అనుకుంటుంది..ఇంతకుముందెప్పుడూ వేరెవరూ ఈ ప్రేమను చూపలేదు. అనుకుంటుంది.

ఈ శీర్షికలో మొదటి గజల్ సత్యవేణి పసుపులేటి గారిది.

"బోసిబోసి నువ్వులతో  అలరించే అనుబంధం..
జీవితమే అందంగా విరిసేనూ మధురంగా..."

అంటూ పాపాయి బోసినవ్వులను విరబూయించారు.మధురమైన గజల్...

   సీనియర్ కవయిత్రి వాణీ వెంకట్..షేర్లు ఏవి బాగున్నాయని చెప్పాలి..ప్రతీ షేర్ తో మనం తాదాత్మ్యం చెందుతాం.

"అమ్మంత  నీదనీ. అణువణువూ అల్లుకుని
తనువంత ప్రేమగా తాకుతూ ఉంటావు.."

ఓహ్! ఎంతో బాగుంది...తల్లి బిడ్డ ప్రేమను ఇంత గొప్పగా ఊహించుకోవడం అద్భుతం...

   మరొక సీనియర్ గజల్ కవయిత్రి ఉమాదేవి ప్రసాదరావు జంధ్యాల గారు.సందర్భానుసారం సరదా పేర్లను గజల్ లో గుప్పించడం వీరి ప్రత్యేకత..

చిత్రానికి తగినట్లు ...

   " ఉంగాల కబురులే చెప్పరా తండ్రీ...
       వాటిలో అర్దాలే విప్పరా తండ్రీ..."

             అంటూ.

  "    కృష్ణ కృష్ణ అంటూ భజన వినగా..

      లేలేత చప్పట్లు కొట్టారా తండ్రీ.."

చప్పట్లు కొడుతున్న పిల్లవాడిని కళ్ళముందుంచారు..

  అవలీలగా పద్యం గజల్ కవిత. యేదైనా 2 నిముషాల్లో రాయగలిగిన కవి రుద్రారం శ్రీనివాస్ రెడ్డి గారు...

ఈ చిత్రం ఆధారంగా మంచి సందేశాన్ని మంచిమాటలు అమ్మ పరంగా చెప్పినందుకు ధన్యవాదాలు....

"నడక నేర్పి నడత నేర్పి జీవితాన కాంతి నిలుపు..
కన్నతల్లి కన్న మిన్న భాగ్యమే ది  లోకంలో" ..

అంటూ తల్లిపై ప్రేమను పంచుకున్నారు..

      ఎంతో ఉత్సాహంగా  చిన్నవాళ్ళతో సమానంగా  గజల్స్ రాస్తూ గజల్ సాహిత్యాభివృధ్ధిలో పాలుపంచుకుంటున్న కవయిత్రి.  నేదునూరి రాజేశ్వరి గారు...

మచ్చుకు ఒక షేర్...

ముత్తెములే మూటగట్టి మురిపించే నీ నవ్వులె
ఎదపొంగులు తాళలేని లేతకొమ్మనైతినేను....

అని గొప్పభావాన్ని వెలిబుచ్చారు...

ఇంకా ...
రారాజువు నీవైతే. రాజు అమ్మ నైతినేను....అనికూడా అంటారు...ఇది చాలా నచ్చింది..

  సుబ్రమణ్య శర్మగారు...మంచి పషేర్లను అందించారు .  అన్ని కాలంలోనే గజల్ ఫార్మెట్ ని అర్ధం చేసుకుని ఎంతో ఉత్సాహంగా గజల్స్ రాస్తున్న వారికి ధన్యవాదాలు....

"అందరిలో నువ్వున్నా  "నా కొడుకే" అని మురిసే.
మనసులోని తల్లి ప్రేమ గొప్పతనం తెలుసుకో..."

నిజంగా ఇది నిజం...ప్రతీ తల్లి తన కుమారుడు ప్రత్యేకం అనుకుంటుంది...మంచి షేర్స్ రాసిన శర్మగారికి ధన్యవాదాలు....

  శైలజ ఆకుండి గారు కూడా వేగంగా గజల్ మూలాన్ని పట్టుకుని గజల్స్ రాస్తున్న  కవయిత్రి. అమ్మ గజల్ అద్భుతంగా రాసారు...

"బ్రహ్మ కొంతైనా చెప్పలేని భాషలోన పలుకుతుంటె.
అమ్మకన్ని తెలుసుననీ చెప్పాలని ఉన్నది లే...."

కాలమంత నీతోనె గడపాలని ఉన్నదిలే
నా బాల్యౌ నీలోనే చూడాలని ఉన్నది లే...

అని మంచి భావమున్నషేర్స్ రాసినందుకు శైలజ గారికి ధన్యవాదాలు...

చిత్రం బాగా నచ్చిందేమో! శైలజ గారికి..మరొక అందమైన గజల్ కూడా రాసారు.

పుత్రుడైన ను, పుత్రికైనను ఒక్కరీతిగ ముద్దుజేయుచు.
కుప్పతొట్టెల విసిరివేయని నేటి అమ్మకు వందనం..

అంటూ, అమ్మాయినీ ,అబ్బాయినీ ఒకే తీరుగా భావించే
తల్లికి నమస్కారం చేస్తూ, కుప్పతొట్టెలొ ఆడపిల్లను వేయని తల్లికి వందనం చేస్తోంది శైలజ....

ఈ విధంగా ఈ వారం గజల్ కాన్వాస్ శీర్షిక  సాగింది..

ముషాయిరాలో పాల్గొనే గజల్ కవులందరూ గజల్ కాన్వాస్ శీర్షిక కి కూడా రాయవలసిందిగా కోరుతున్నాను...

ఈ శీర్షిక నిర్వహించడానికి అవకాశం ఇచ్చిన జ్యోతిర్మయి గారికి ధన్యవాదాలతో, గజల్ మిత్రులందరికీ శుభాకాంక్షలతో...

మీ

శ్యామల గడ్డం......02-05-2018...