గజల్ ముషాయిరా......రచన..డా.శ్యామల గడ్డం.....30-05-2018..
+++++++++++++++++++++++++++++++++
కలలోన నీ రూపె కదులుతూ ఉంటుంది..
మంత్రమై నీపేరు నిలుస్తూ ఉంటుంది,...
నీ ఊహ క్షణమైన కలిగితే చాలులే..
నా మనసు జడముగా మారుతూ ఉంటుంది....
నీ కనుల భాష్యాలు చదివితే చాలులే..
నా హృదయ రాగమూ పలుకుతూ ఉంటుంది..
ఆమనీ కోయిలా పాడితే తీయగా,
నీ గీత మాధురీ తడుముతూ ఉంటుంది..
నీ వలపు తలపులే తలుపులే తీయగా..
మాటలే కవితయై పారుతూ ఉంటుంది..
విరహాగ్ని పొగలోన నీ రూపె కనబడదు.
ప్రేమతో వర్షించ తొలగుతూ (పొగ)ఉంటుంది...
డా.శ్యామల గడ్డం.....30-05-2018
No comments:
Post a Comment