చిత్రకవితామంజరి...
మేఘాలా దొంతరలో తేలియాడు చెలికాడా
యవనాశ్వమునెక్కినీవు వచ్చెదవా చెలికాడా
జ్యోత్స్నాభిసారికలా ఎదురుచూసితిన్నాళ్ళూ
కలలలోనా నినుచేరా సాగితిరా చెలికాడా
శిశిరములో వసంతమై వచ్చెదవా వేగముగా
విరహాగ్నికి తుషారముగ రావేలా చెలికాడా
అనురాగపు మధురిమలు కురిపించగ లాలనతో
ప్రేమసుమమునందీయగ కదిలావా చెలికాడా
నీ మనసున మల్లెలు నే పూయించెద తమితీరా
శ్యామ శ్వాస నిలిపేలా నిలిచితివా చెలికాడా.....
డా. శ్యామలగడ్డం.....25.01.2017....
No comments:
Post a Comment