Friday, 27 January 2017

కోరుకుంట...గజల్...27-01-2017

గజల్ కాన్వాస్....42...రచన..డా. శ్యామలగడ్డం.....26-01-2016

నెలరాజూ కిరణాలలొ మననెలవును కోరుకుంట
చలువ రాతి మేడలోనె మన గూడును కోరుకుంట

గోధూళీ వేళలోన మన ప్రేమను పంచుకుంటు
వ్యాహ్యాళిగ నందనమున తిరుగాటను కోరుకుంట

ప్రేమాలయ దీపముగా నీ మనసున నేనుంటూ
కఠినమైన హృదయమునా స్పందననూ కోరుకుంట

వేదనలే అరువిచ్చీ మమతలనే పెంచుకుంటు
జీవితాన మరువరాని అమృతమును కోరుకుంట

కుటుంబమే జలధిగాను ముత్యాలే యేరుకుంటు
మనసారా వసుధైకా కుటుంబమును కోరుకుంట

No comments:

Post a Comment