Tuesday, 20 March 2018

గజల్.......డా.శ్యామలగడ్డం..20-03-2018

మల్లెల నవ్వుల పువ్వులు విరియుట
  మాటల దండలు అవసరమేగా
  చెలిమిని చూపే చెలియ కరుణలూ,
కలిమికి దారులు, అవసరమేగా

సంద్రపు అలలూ నింగిని తాకగ.
నల్లని మేఘము భళ్ళున కురిసెను.
కన్నియ మనసున కడలియె నిలువగ.
కంటికి   ధారలు అవసరమేగా....

తూరుపు కనుమల కెంజాయలతో
వెలుగులు నింపగ తపనుడు వచ్చెను.
తామర బుగ్గల సిగ్గులు పూయగ
తడబడు అడుగులు అవసరమేగా...

మనసున దాగిన ఆశల  వల్లరి
   తలచిన ఎత్తుకు ఎగబాకేనా....
గమ్యం చేరగ గమనము, లక్ష్యము ,
తపనలు, పరుగులు అవసరమేగా....

కలిసిన మనసుల  కథలతొ, సొదలతొ
రాగం  రవళులు వినిపించేదా...
కలవని మతముల , కులముల గొడవలు
  మరచిన మమతలు అవసరమేగా....

ఆకస మేలే రాజుని చేరగ

తారలు కదలగ తపనలు ఎన్నో...
చుక్కలు  పక్కలు పరచిన వైనం,
జిలుగు వెలుగులూ అవసరమేగా..

డా.శ్యామలగడ్డం..20-03-2018...

No comments:

Post a Comment