Wednesday, 28 March 2018

తెలుగు గజల్..27-03-2018

తెలుగు గజల్....డా.శ్యామలగడ్డం..27-03-2018

చిన్ననాటి చెలిమిని నే  పంచాలని ఉన్నదిలే..
మమతలతో  మారాకులు తొడగాలని ఉన్నదిలే..

చిరునవ్వుల చిరుజల్లులొ తడవడమే ఆనందము..
మనసు విప్పి మదికోరిక చెప్పాలని ఉన్నదిలే. ..

కన్నులలో కరిగిపోని సముద్రాలు యెన్నున్నా..
చెక్కిలిపై  రానీయక గెలవాలని ఉన్నదిలే

ఊహలలో  చిత్తరువును చిత్రించిన చాలదుగా..
కాగితమున కవిత్వమై మెరవాలని ఉన్నదిలే..

మరచిపోని మరువలేని మదిగాయాలెన్నెన్నో..
.ప్రేమయనే
లేపనమును పూయాలని  ఉన్నదిలే
.....

డా.శ్యామలగడ్డం...28-03-2018...

No comments:

Post a Comment