Wednesday, 4 April 2018

Ghazal 4-4-2018

ముషాయిరా... తెలుగు గజల్...04-04-2018..
+++++++++++++++++++++++

అక్షరాలు అనంతమూ  ఆపలేరు ఎవరైనా
శ్యామమనసు స్వచ్చమనీ తెలియలేరు ఎవరైనా

రవికిరణం సోకినంత పంకజానికెంత సొగసొ!
కవిత సొంపు  లేకుండా మెచ్చలేరు ఎవరైనా...

నింగి అంచు నున్న చుక్క రాలిపోక ఆగదులే..
కడలి నున్న అలలపొంగు ఆపలేరు ఎవరైనా..

మంచి యున్న చాలదులే  మాటయున్న సరియేగా..
శక్తియుక్తు లున్నగాని గెలవలేరు ఎవరైనా..

గుండెల్లో బడబాగ్నులు ఎన్నున్నా  ఎంచలేవు....
కళ్ళ వెనుక  సంద్రాలను దాచలేరు ఎవరైనా

శ్యామల గడ్డం...04-04-2018

No comments:

Post a Comment