Thursday, 19 April 2018

గజల్ ముషాయిరా...19-04-2018..

ముషాయిరా  గజల్......

శ్యామ మనసులొ  వెన్నెలుంటే తిమిరమంతా చెదరిపోదా...
గతముగాయమె  తెలుసుకుంటే  వేదనంతా చెదిరిపోదా...

1.బాధలన్నో మదినినిండగ  బాల్యమంతా గురుతు        రాదా....
   చెంతచేరే మనిషి ఉంటే   తిమిరమంతా చెదరిపోదా..

2. వసంతుడే తోడు రాగా  పిల్లగాలికి ఆటవిడుపు...
     మగువ మనసున గూడు కట్టిన వేదనంతా చెదిరిపోదా...

3.ఆడపిల్లలు ఆదిలక్ష్ములె అవనికంతా వెలుగుదివ్వెలు.
    నిండు వెన్నెల పరచినంతా  శోకమంతా చెదిరిపోదా...

4. అక్షయముగా భాషవుండగ ఆంగ్లమెందుకు శుధ్ధదండగ...
    తెలుగువెలుగుల జిలుగు చూపగ భ్రాంతిఅంతా      చెదిరిపోదా...

5..మనసు వీడని మౌనవీణే .హృదయ ద్వారము        మూసివేయగ..

.రెప్పదాటిన కంటనీటికి చెక్కిలంతా చెదరిపోదా..

6.    చిన్నపిల్లను కరుణ లేకయె చిదిమి వేసిరి     మృగమదాంధులు..
     మనుషులంతా ఒక్కటైతే   దుష్టత్వమంత చెదరిపోదా!

7. ధనముమదమూ మనిషి చేరిన కళ్ళపొరలూ కమ్మునెపుడూ..
    మానవత్వమె మంటకలిసిన బంధమంతా చెదరిపోదా...

8. నీటిచుక్కే లేకపోతే మనిషి మనుగడ ప్రశ్నయే మరి...
      వానదేవుడి కరుణఉంటే కరువు అంతా చెదరిపోదా...

9.   కొమ్మకొమ్మకు కోయిలమ్మా పాటపాడగ   మధురమౌనూ..
     మావిచిగురూ లేకయున్నా  గానమంతా చెదరిపోదా.

గజల్ రచనా.......

డా.శ్యామల గడ్డం....19-04-2018

No comments:

Post a Comment