జలవిలయము...వర్ణన...
ఆ.వె. జలము ప్రాణ ధార జనులకు యెంచగా,
కలము కత్తి యౌను కవుల యెదకు,
జలవిలయము కలుగగ,జాలి గొలుపగను..
ప్రజలు మౌను లయిరి పలుకు లేక!
వర్ణన....జలవిలయము....22-08-2018...డా.శ్యామల..
తెలుగు సాహిత్య సుధాంబుధి....వారు ఇచ్చిన దత్తపది...
దత్తపది...గంగ, యమున, గోదావరి, కృష్ణ ...
22-08-2018...రచన, డా.శ్యామల గడ్డం...
దత్తపది....
తే.గీ. భవుని కృప చేత దిగినది భవ్య గంగ
యముని చెల్లెలై అలరారి యమున వెలసె..
నాసికమ్ము గోదావరి నామ పుట్టె
పంట లొసగగ కృష్ణమ్మ పరుగులిడెను..!
డా.శ్యామల...22-08-2018...
No comments:
Post a Comment