Saturday, 23 September 2017

జానపదం..20-09-2017

జానపద గేయం......20-09-2017..

ఆడుతు, పాడుతు, పనిచేస్తూ
తోడుగ , నువ్వు నిలువగనే.......

పనికే అలసట కలిగిందేమో....
పద,పద, పదమని తొందర వెట్టె.....

జాము రాతిరి వేళ ఆయెనే
సెందురుడేమో తొంగి సూసెనే...
సిగలో నువ్వు పువ్వులు పెట్టీ,,
అటునిటు తిరుగా.....
మనసు ఆగదే....
వయ్యారి మరదలా......

చెంపకు చారెడు కన్నులతోటీ....
ముక్కుకు ఎట్టిన ముక్కెర తోటీ..
ఘల్లు ఘల్లు మను గజ్జెలతో నువ్..
ఛంగ్ ఛంగ్ నా ఉరుకులు వెడితే..
నా  వయసేమో ఆగనంటదే...........ఆడుతు....

డాక్టర్.శ్యామలగడ్డం....

No comments:

Post a Comment