గజల్ కాన్వాస్-- 38--- నెచ్చెలీ...28-12-2015-----డా. శ్యామలగడ్డం
కలలలోన తేలియాడు సమయమేలె నెచ్చెలీ
రెప్పలేమొ బరువాయెను నిదురలేదె నెచ్చెలీ
మరుని రూపమగుపించెగ మదియె పులకరింతకాగ
మరునిముషము కానరాక కలవరమె నెచ్చెలీ
తానురాక తనవంతున లేఖలెన్నొ పంపినాడు
జాబిలియే జారవిడుచు వెన్నెలాయె నెచ్చెలీ
సుమశరుడే సంధించిన బాణమేను మదినితాక
విరహానల వేగుచుంటి..దయచూపడె నెచ్చెలీ
ప్రతిక్షణమొక యుగముగాను సాగుచుండె తాపముతొ
తుషారముగ తాకగాను తాను రాడె నెచ్చెలీ
డా. శ్యామలగడ్డం......
No comments:
Post a Comment