Friday, 29 December 2017

కవనతరంగిణి.........

మిథున కవితా వనం సభ్యులకు నమస్సుమాంజలులు...ఇంకొన్ని గంటల్లో శనివారం
వచ్చేస్తుంది.. శనివారం కవనతరంగిణికి స్వాగతం సుస్వాగతం........

ఆధునిక కవితా ప్రక్రియలకు పెద్దపీట వేసే కవనతరంగిణి మీ ముందుకు వచ్చింది......దీనిలో...

రుబాయీలు,
గజళ్ళు,.
నానీలు..
నానోలు.
హైకూలు.
రెక్కలు
ఏకపాదకవితలు,
ద్విపాదకవితలు,...
త్రి పాద కవితలు...
వచన కవితలు..
చిత్ర కవితలు
పద్యాలు...

మరి యే ఇతర ప్రక్రియ అయినా.....కవనతరంగిణికి రాసి పోస్టు చేయవలసిందిగా కోరుతున్నాను

సభ్యులందరికీ ఆంగ్ల నూతన సంవత్సరం 2018 శుభాకాంక్షలతో.....కవనతరంగిణికి స్వాగతం....2018, కొత్త సంవత్సరంలో,
ఆశల వలువలు  చుట్టుకొని, ఆశయాల ఆమనిలో , సంకల్పమే సాధనంగా  లక్ష్యమనే తీరాలను చేరాలని  మనసారా కోరుకుంటూ.....ఈ వారం కవనతరంగిణికి మరొక్కసారి మీకందరికీ స్వాగతం, సుస్వాగతం...

"కవిత్వమంటే పందిరి మీదకు ద్రాక్షతీగను పాటించడం, పద్మవ్యూహం లోంచి బయటపడే ప్రయత్నం చేయడం, పియానో మెట్లమీద సమ్మోహనరాగ జలపాతాలను దూకించడం."...అంటారు దేవీప్రియ...

సుప్రసిద్ధ కవి జర్నలిస్టు దేవీప్రియ రచించిన గాలి రంగు కవితాసంపుటికి 2017 సంవత్సరంలో  కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు రావడం ముదావహమైన విషయం.నాలుగున్నర దశాబ్దాలుగా కవిత్వాన్ని వాహికగా చేసుకొని మంచి కవిత్వాన్ని వెలయి స్తున్నారు.....

దేవీప్రియ గారి అసలుపేరు షేక్ కాజా హుస్సేన్.గుంటూరు జిల్లా వాస్తవ్యులు..‌..దేవీ ప్రియ కలం పేరుతో   అరణ్యపురాణం,  అమ్మచెట్టు, నీటిపుట్ట, గరీబుగీతాలు, పిట్టకూడా ఎగిరిపోవాల్సిందే మొదలైన కవితా సంపుటులను వెలువరించారు.

కవిత్వాన్ని అతి సామాన్యంగా, అసామాన్యం గా చెప్పగలిగే కవి.

"నడిస్తే మదపుటేనుగు లా నడవాలి/ నవ్వితే మొనాలిసాలా నవ్వాలి/రాస్తే కాళిదాసు లా రాయాలి/ గీస్తే పికాసో లా గీయాలి/ పుడితే మా అమ్మకడుపున పుట్టాలి/ కవిగా అచ్చంగా నాలాగానే పుట్టాలి"/ అంటారు దేవీ ప్రియ......

ఇలాంటి గొప్ప కవులను ఆదర్శంగా తీసుకుని కవిత్వరచన చెయ్యవలసింది గా కోరుతున్నాను...

ఈ వారం నూతన సంవత్సరానికి స్వాగతం చెబుతూ....

కవితలుగానీ, పద్యాలు కానీ...పైన తెలిపిన ఏ ప్రక్రియలో నైనా మీ రచనా ప్రావీణ్యాన్ని ప్రదర్శించవచ్చును..

లేదంటే మీకు ఇష్టమైన ఏ వస్తువునైనా గ్రహించి రచనలు చేయవలసిందిగా మనవి...

కవనతరంగిణిని నిర్వహించడానికి అవకాశం ఇచ్చిన అడ్మిన్ లీల గారికి ధన్యవాదాలతో, సభ్యులందరికీ శుభాకాంక్షలతో....

అడ్మిన్,

డా.శ్యామల గడ్డం.

(29-12-2017)30-12-2017...

No comments:

Post a Comment