.గజల్.03-06-2017...డా.శ్యామలగడ్డం...
పసిపాపల బోసి నవ్వు మనసులోకి చేరుతుంది..
వసివాడని పువ్వందం కంటిలోకి చేరుతుంది..
పడతి లోని సౌందర్యం కవులమనో వీధిపైన..
కదలాడుతు కావ్యంగా కలలలోకి చేరుతుంది
కడలిలోని నీరంతా నింగిలోకి చేరుకుంది
ప్రేమతోని వానజల్లు పుడమిలోకి చేరుతుంది..
తీరమెగసి అలలకన్య తీగలాగ. అల్లుకుంటె..
పులిన స్థలి కరిగికరిగి నీటిలోకి చేరుతుంది...
వెన్నెలెంత తాగిందో. చకోరమే అలసిందీ
నీలిమేఘ శ్యాముని కని నిదురలోకి చేరుతుంది..
డాక్టర్.శ్యామలగడ్డం....03-06-2017
No comments:
Post a Comment