గజల్ పూరణం... డాక్టర్.శ్యామలగడ్డం..02-06-2017..
±++++++++++
గాలిలోన నాట్యమాడి కదులుతుంది వానచినుకు
తరగలలో ఒక్కటిగా సాగుతుంది వానచినుకు
మొక్కజొన్న పొత్తులోన హారముగా మెరిసినట్లు
కరిమబ్బుల అంచులలో. జారుతుంది వానచినుకు....
నిరుపేదల రైతన్నల ఎదురుచూపు చినుకుకొరకు
నీలిమబ్బు కరుణించీ కురుస్తుంది వానచినుకు.
మొయిలు చూసి మయూరాలు పురివిప్పీ ఆడినాయి.
భూమాతయె వేచిఉండ రాలుతుంది వానచినుకు
నీలిమేఘ శ్యాముడినీ వరమిమ్మని కోరుతుంది..
కోరిన ఫలమందీయగ చిందుతుంది వానచినుకు.
డాక్టర్.శ్యామల గడ్డం...02-06-2017..
No comments:
Post a Comment