Friday, 11 August 2017

గజల్

గజల్ పూరణం...11.08.2016
+++++++++++++++++++++

అమ్మచెంత మనసుంటే ఆమెకరుణ సులువుకదా

అలుకచెందు పసిపాపల కోర్కెతీర సులువుకదా

బాధనొందు హృదయానికి గాయమవుట తేలికలే

గతమంతా మరచిపోవు మందుండిన  సులువుకదా

జ్ఞానజ్యోతి మెరుపుల లో కలలుకనుట సౌఖ్యములే

భాగ్యరాశి తానంతట కదలినంత సులువుకదా

మానవుడే మాధవుడని తెలుసుకొనుట వివేచనము

కనులముందు దైవాన్నే దర్శించుట సులువుకదా

ఆకులందు అణగియున్న పికముగళము మధురమవులె

మధురరాగమాలపించ దర్శించుట సులువుకదా..

డా. శ్యామలగడ్డం...11.08.2016

No comments:

Post a Comment