సీస పద్యము....
గడించె కాలము గణనసేయగ
మీనమేషములును మేలు చూడ
వారము చూడంగ వర్జ్యము లెన్నంగ
కాగల కార్యము కాన లేము.
శకునము శాసించ శ్వాసయు ఆగిపోవు
వైద్యము చేయించ వయసు పెరుగు
కులము ఎక్కువనుచు గొప్పలు పోయెదే
మనిషిలో ప్రవహించు మాన వతయె....
ఆ .మంత్రములకు రాలునేచింత కాయలు.
జపము చేయగ జడత మాన గలడ.
నీతిమంతుడుగను నియతితోడ
నిలువ జయము నీదె నిశ్చయముగ....
డాక్టర్.శ్యామల గడ్డం...16-08-2017...
గడించె కాలము గణనసేయంగను
మీనమేషములును మేలు చూడ
వారము చూడంగ వర్జ్యము లెన్నంగ
కాగల కార్యము కాన లేము.
శకునము శాసించ శ్వాసయు నిలుచుగా.
వైద్యము చేయించ వయసు పెరుగు
కులము ఎక్కువనుచు గొప్పలు పోయెదే
మనిషిలో ప్రవహించు మాన వతయె....
మంత్రములకు రాలునేచింత కాయలు.
జపము చేయగ జడత మాన గలడ.
నీతిమంతుడుగను నియతితోడ
నిలువ జయము నీదె నిశ్చయముగ....
డాక్టర్.శ్యామల గడ్డం...16-08-2017...
No comments:
Post a Comment