Tuesday, 10 October 2017

పద్యం....10-10-2017

పద్య తరంగిణి... మిథున కవితా వనం..

చెప్పంగ వశమౌన చెడువాన సిత్రాలు
      బతకలేక జనులు వెతలు చెంద

ఊరనకయు,వాడనక ఊర్కొనక యు వాన
     కురిసికురిసి ఆగి  కమ్ముకొనియె..

బడుగు బ్రతుకులెల్ల  బావురనియె చూడ.
     పనియు పాటయులేక పాట్లు పడగ.

వరదగండమెపుడొ  వాసము కోల్పోగ.
      చేతికొచ్చిన పంట  చేర రాక.

దిగులు చెంది పేద  దీనుడై  భీరుడై
భవిత కవిత యయ్యె  భారమాయె
ప్రభుత  సాయ మడగ  పంచను చేరగా.
కురిసె జోరు  వాన  కుంభ వృష్టి....

డాక్టర్.శ్యామల గడ్డం....10-10-2017...

No comments:

Post a Comment