చెప్పంగ వశమౌన చెడువాన సిత్రాలు
బతకలేక జనులు వెతలు చెంద
ఊరు వాడ లనక ఊపిరి తీయగా
కురిసికురిసి వాన కుమ్మరించె...
బడుగు బ్రతుకులెల్ల బావురనియె చూడ.
పనియు పాటయులేక పాట్లు పడగ.
వరదగండమెపుడొ వాసము కోల్పోగ.
చేతికొచ్చిన పంట చేర రాక.
దిగులు చెంది పేద దీనుడై భీరుడై
భవిత కవిత యయ్యె భారమాయె
ప్రభుత సాయ మడగ పంచను చేరగా.
కురిసె జోరు వాన కుంభ వృష్టి....
No comments:
Post a Comment