అమ్మంటే అనురాగం ....విరజాజుల పరిమళమే
అమ్మంటే అనుబంధం.....లేతీగల సున్నితమే.....
అమ్మంటే నిస్వార్ధం ....వెలుగు నిచ్చు కొవ్వొత్తిలె....
అమ్మంటే ఆప్యాయత ....సువాసనల సుగంధమే..
.
అమ్మ చూపు వెలలేనీ....శరత్కాల వెన్నెలలే
అమ్మంటే ఆర్ద్రములే....కన్నీటీ తుషారమే
అమ్మంటే అవనికదా....అంతులేని క్షమాగుణం
అమ్మ పిలుపు అలరించే వసంతాల కోమలమే
అమ్మ మాట విన్నంతనె లేడిలాగ గెంతు మనసు..
శ్యామ చెంత నిలుచునుగా కైమోడ్పుల దైవతమే....
డా.శ్యామలగడ్డం...
21-10-2017
No comments:
Post a Comment