Friday, 9 December 2016

తెలుగుగజల్..,09.12-2016

గజల్ పూరణం..20..రచన. డా. శ్యామలగడ్డం...09-12-2016..

అందమైన గజలు విన్న రసానందం పొంగుతూ ఉంటుంది
శృతిలయలు గానముతొ జతకూడి రాగసుధ చిలుకుతూ ఉంటుంది

మౌనములే మనిషిని మహనీయునిగా తీర్చిదిద్దు సాధనాలు
మంచితనం దేవతైన మనసు దీపమై వెలుగుతూ ఉంటుంది

సప్తవర్ణాల హరివిల్లు తానుగా మెరిసెనే మబ్బులొ రాణిగ
నిండు పున్నమిరేయి  ధారలుగా అమృతము వంపుతూ ఉంటుంది

మేఘాల మాటునా రేరాజు దొంగాటలాడుతూ ఉంటాడు
తారకయె రారాజు యేడనీ వెతలతో వెతుకుతూ ఉంటుంది

సప్తాశ్వ రధముపై దినకరుడు పయనమూసాగించ
తూరుపున ఆకసము నునుసిగ్గు దొంతరలు నింపుతూ ఉంటుంది...

డా. శ్యామలగడ్డం...09.12-2016...

No comments:

Post a Comment