చిత్రకవితా మంజరి...14-12-2016....రచన. డా. శ్యామలగడ్డం...
నీవు నేనుగ కలసిపోయిన మధురగీతం పాడనా
పూవులోనీ తావినంటిన మంచిగంధం కురవనా
గాలిలోనా తలలువూపే కొమ్మతో సయ్యాటలాడ
మనసులోనా ఊయలూగే వీణనాదం పలుకనా
మంచు పల్లకి నెక్కినీవూ గగనమందూ విహరించగా
మురిసిపోయే నదినినేనై జలధిఅందం చూడనా
మరువలేనీ ప్రేమ విరులు కురిసి విరిసే వింతగా
మమతదరులా జ్ఞాపకాలుగ ప్రేమ బంధం కూర్చనా
వీడిపోయిన తీగబంధం మరల అల్లిక సాగునా
శ్యామ యెదలో పొంగిపోయే భావగీతం రాయనా
డా. శ్యామలగడ్డం..14-12-2016....
No comments:
Post a Comment