గజల్ పూరణం...రచన డా. శ్యామలగడ్డం....22-12-2016
+++++++++++++++++++++++++++++++
కళ్ళల్లో దాగాలని కన్నీళ్నకు ఎలా తెలుసు
ముళ్ళల్లో దాగాలని పుష్పాలకు ఎలాతెలుసు
ముత్యంగా మారాలని వానచినుకు అనుకుందా?
ఉప్పెనగా ముంచానని కెరటాలకు ఎలా తెలుసు
తామరపై బిందువుగా నిలవాలని కోరిందా
తుంపర గా కురియాలని మేఘమునకు ఎలాతెలుసు
బోసినవ్వు చిందించే పసిపాపల కేరింతలు
మురిపాలను పంచాలని పసివయసుకు ఎలాతెలుసు
మనసులోతు తెలియనిదే మైత్రి ఎలా నిలువగలదు
శ్యామ తెలుపు మదిలోతులు నేస్తాలకు ఎలా తెలుసు
No comments:
Post a Comment