చామంతి పువ్వల్లే విరబూసి నవ్వింది మా అత్త
సిరి మల్లె పువ్వల్లే స్వఛ్ఛంగ నవ్వింది మా అత్త
సుఖమైన, దుహ్ ఖమైన ఒకటే తీరుగ నుండునులే
విరబూసిన మందారమోలే. నవ్వింది మా అత్త
మాటతో, నవ్వుతో మనమనసూ గెలుస్తుంది
మంచువోలే తడియారనీ సుమమేలే. మా అత్త
ప్రేమతోను, లాలనతోడ గీతా మారుస్తుందీ
పద్మములో లక్ష్మి లా చిన్నగ నవ్వింది మా అత్త
మురళీ మనోహరిగా. విశ్వమంతా ఆనందంగా
శ్యామలముతొ తిరుగుతు హాస్యంగ నవ్వింది మా అత్త
డా. శ్యామలగడ్డం.... నల్గొండలో ఉన్న మా అత్తపైన గజల్.....
No comments:
Post a Comment