గజల్ పూరణం.... డా. శ్యామలగడ్డం..29-12-2016
++++++++++++++++++++++++
భూదేవికి. పచ్చకోక కట్టాలని ఉన్నదిలే
వానజల్లు పుడమిబాట పట్టాలని ఉన్నదిలే
కడలిలోన లోతుయెంతొ తెలుసుకునే తొందరలో
అలలలోన అందమెంతొ చూడాలని ఉన్నదిలే
కొమ్మలోని కోయిలమ్మ గళమెత్తీ కూయగాను
రాగాలే. రసధునులై. పాడాలని ఉన్నదిలే
వసంతమే వసనముగా వనమునందు నింపేసెను
పల్లవించు కోరికలే. తీరాలని. ఉన్నదిలే
నీలిమేఘ శ్యాముడే కరిమబ్బుగ మారినేడు
భూమాతను తనివితీర తడపాలని ఉన్నదిలే....
డా. శ్యామలగడ్డం....29- 12- 2016...
No comments:
Post a Comment