Wednesday, 5 July 2017

కవిత ...‌ఇల్లాలు...

మిథున కవితా వనం....భావ సుధా చంద్రికలు...

++++++++++++++++++++++++++++++++
డాక్టర్.శ్యామల గడ్డం....05-06-2017....

నీ చిరు మందహాసంలో ఎన్నెన్ని భావాలలో....
నీ చిన్ని మనసులో  ఎన్నెన్ని ఆశలో...
నీ మది కవాటంలో  ఎన్నెన్ని కోర్కెలో...
నీ హృది వాకిట ఎన్నెన్ని  ఆనందాలో...

కవయిత్రి...
------------+++-----

ఎక్కడో ఒకానొక భయం...
కొత్త పెళ్ళి కూతురునై అడుగు పెట్టిన నేను..
నాది కాని కొత్త ఇల్లును , కొత్తవాళ్ళను..
నాదిగా, నా వాళ్ళుగా చేసుకోవడం ఎలాగని?...

మదిలోని తిమిరాన్ని, కాసేపు స్తబ్దుగా మారిపోయిన
మనసును ఊరడించి ఊరుకోబెట్టి  జీవితంలో
సంతోషమనే. చిరుదివ్వెను వెలిగించి....
సంతృప్తి అనే కాగడాతో నలుదిక్కులా
నడయాడే దీపపు సెమ్మెనై, ..వెలుగు రేకలు.
వికసింపచేసి,. సంసారమనే పడవకు దిక్సూచిగా
నిలిచి ,ఇంటికి దీపం ఇల్లాలు...అన్న పేరుకు పెన్నిధి గా మారుతానని మాటిస్తూ.....

ఇల్లాలు....
+++++++

డాక్టర్.శ్యామల గడ్డం..05-06-2017..

No comments:

Post a Comment