పద్యం తరంగిణి..సీసపద్యము..
+++++++++
అతివ పుట్టకమున్నె అంతరంగమునందు
దిగులు చెందును తండ్రి దీర్ఘముగను
ఆడపిల్ల యనగ ఆడ పిల్లనుచును.
పలుకుచుందురు లోకులు పరుషముగ
ప్రేమయన్న పడతి ప్రేమకాదామరి?
అన్నదమ్ములనిన ఆటవిడుపుయెకాద.
తల్లితండ్రియనిన తల్లడిల్లు తరుణి.
సేవ చేయు వారి సేమము కోరి..
ఆ.వె.అలతిఅలతి మాట అలది ముద్దుగొలుపు .
ఆడపిల్ల భువిని. ఆదిలక్ష్మి
మల్లె వంటి మమత మనసున్న మారాణి
భార్య విలువ కన్న భవిత మిన్న...
డాక్టర్.శ్యామల గడ్డం...18-07-2017..
No comments:
Post a Comment