Friday, 14 July 2017

భావసుధా చంద్రికలు...గోరింట

.
అరే! చెంగలువ చేతిలోకి వచ్చిందే!..

గోరింట పేరుతో...

అరచేత చంద్రుణ్ణి నిలిపి..

చుట్టూ చుక్కలను పేర్చి...
పక్కకంటకుండగ....

జాగ్రత్తగుండగా...
పండింది గోరింట
తాంబూలమేసిన నోరులా...
సూర్యోదయమున సూర్యబింబం లా...

పండింది గోరింట మొక్కలే కుండానే..

అతివ అయిదవతనము కాపాడు గౌరియే...
శుభకార్యములయందు శుభమిచ్చు లక్ష్మివే ....
కళ్యాణములయందు  కమనీయ కాంతి వే
మగువ మనసులోన కదలాడు ఆశవే
అందాల ఆమనిలొ  విరిసిన మందారమో..
మావిచిగురంటిన  శోణిత వర్ణమో...మనసుదోచిన
వరునికి కలలపంటవుగా..
గోరింట ఉండగా ఇంటింట పండుగ...

డాక్టర్.శ్యామలగడ్డం....13-07-2017...

No comments:

Post a Comment