.
ముషాయిరా గజల్...05-05-2016... డా. శ్యామలగడ్డం
సత్యాన్నే సరి తూచగ త్రాసెక్కడ దొరుకుతుంది
ధర్మాన్నే. తెలియచెప్ప పదమెక్కడ దొరుకుతుంది
మాటలతో మాయమైన లోకమిదీ
మనసుతోని మాటాడే చెలిమెక్కడ దొరుకుతుంది
నీలిమేఘ శ్యాముడిని రారమ్మని పిలిచినంత
పరుగుతోడ ప్రవహించే ధారెక్కడ దొరుకుతుంది
అమ్మంటే అంతులేని పెన్నిధిగా లోకంలో
ఆమెకన్న మరి దేవత ఇంకెక్కడ దొరుకుతుంది
ఆశలతో పాశముగా కట్టేసుకు పోతుండగ
అచ్చమైన ప్రేమపాత్ర మరి యెక్కడ దొరుకుతుంది
రామనామ జపముతోడ హరియించును పాపాలే
ఏకాగ్రత కుదురుకొనగ క్షణమెక్కడ దొరుకుతుంది
డా.శ్యామలగడ్డం.....5-5-2016
No comments:
Post a Comment