Friday, 23 September 2016

15. తెలియాలీ...29-06-2016

గజల్ కాన్వాస్....64....రచన.డా.శ్యామలగడ్డం....

.
ఒంటికాలుపై చేసే   తపమేదో   తెలియాలీ
పూలఋతువులో  దాగే తపనేదో తెలియాలీ

రంగులన్ని పంపుకున్న. సొగసరివీ  నీవేలే
మదనునితో ఆటలాడె మనసేదో తెలియాలీ

రాగసుధలు  చిలికించగ రాజుతో మంతనమా
విరహానల సుఖములోని మమతేదో తెలియాలీ

ఇంద్రచాపమై. నీవు   ఇంద్రుడినే  గెలవాలా
అచ్చరలను. తలదన్నే అందమేదో తెలియాలీ

మరుమల్లెల జడివానలొ మనసేమో విరబూసే
మరునిచాపముగ  మారే   చూపేదో  తెలియాలీ ..

డా. శ్యామలగడ్డం...29-06-2016...

No comments:

Post a Comment