నీ కన్నుల కాంతులలో వెలుగునైతి ప్రియతమా/
నీ చెక్కిలి మందారలొ రేకునైతి ప్రియతమా //
నీ చూపుల తళుకులలో మెరుపైనా దిగదుడుపే/
నీ ఆశల వల్లరిలో పందిరైతి ప్రియతమా //
నీ అభినయ ముద్రలలో భావగీతి దొంతరగా /
నీ మనసున మ్రోగించే వీణనైతి ప్రియతమా //
నీ మేనినంటుకునే హరితకోకనైపోనా /
నీ మౌనా ముద్రలలో చిత్రమైతి ప్రియతమా //
తలుపుచెంత తలపులతో వేచియున్న కలువవుగా /
జావళీలు పాడుతూ జాబిలైతి ప్రియతమా //
డా. గడ్డం శ్యామల...... గజల్ కాన్వాస్------26-10-201
No comments:
Post a Comment