తెలుగు గజల్...రచన ..డా. శ్యామలగడ్డం...27-09-2016....
నేను వ్రాసిన 100 వ గజల్...... ఉందేమిటి....
నవ్వుతున్న చందమామ వెలిగినట్లు ఉందేమిటి
కవ్వింపుగ తారకలూ వచ్చినట్లు. ఉందేమిటి
సంధ్యవేళ పడమటిల్లు చేరిందో ఇనబింబం
పగడపు రాశులతోనా నింపినట్లు ఉందేమిటి
చక్రవాక జంటలేమో చిన్నబోయె ఇరులయందు
చకోరములె హుషారుగా లేచినట్లు ఉందేమిటి
చక్రవాక విరహాగ్నికి రేగుచున్న పొగయేమొ
చీకటింట ఆకసమ్ము మునిగినట్లు ఉందేమిటి
తూర్పునేమొ కెంజాయగ మెరసిపోయె నెలరాజూ
నీలిమేఘ శ్యాముడుమరి పొంగినట్లు ఉందేమిటి
డా. శ్యామలగడ్డం....27-09-2016
గజల్ శతం రాసిన సందర్భంగా గజల్స్ వ్రాయడానికి ప్రోత్సాహమిచ్చిన గురువులు Rvss Srinivas గారికి, Madhav Rao Koruprolu గారికి గజల్ కాన్వాస్ కి pics ఇచ్చిన సిరి వడ్డే గారికి తప్పు లు సరి చేసిన ప్రతి ఒక్కరికీ..
మన స్ఫూర్తి గా ధన్యవాదాలు తెలియచేస్తున్నాను.......
డా. శ్యామలగడ్డం....
...
No comments:
Post a Comment