Friday, 23 September 2016

14..ఉన్నదిలే...26-05-2016..

గజల్ .......26-05-2016....
రచన.డా. శ్యామలగడ్డం...

అమావాస్య తిమిరాన్నే కలిగిస్తూ ఉన్నదిలే
భూమిపైన  కాటుకనే కనిపిస్తూ ఉన్నదిలే

నీలిమబ్బు జలతారులొ చంద్రబింబమగుపించే
కురులనడుమ చెలిమోమే అగుపిస్తూఉన్నదిలే

మాటకరకు మనసువెన్న గుండెలోతు ఎవరికెరుక
మాటతీపి విషముగుణము కలహిస్తూ ఉన్నదిలే

బ్రతుకులోన ముళ్ళపొదలు దాగున్నవి నాగులాగ
ముళ్ళపైన గులాబీయె విరియిస్తూ ఉన్న దిలే

శ్యామలోన తెలుపలేని భావాలే ఎన్నెన్నో
ఎవరితరము తెలుసుకొనుట అనిపిస్తూ ఉన్నదిలే

తప్పుంటే ఒప్పుకోని సరిచేస్తూ రాస్తానులె
కప్ప లేని నా మనసును సవరిస్తూ ఉన్నదిలే...

No comments:

Post a Comment