ముషాయిరా గజల్...21-07-2016...
++++++++++++++++++++++++
మంచి మాట పలుకగాను అలకేదీ లేదుకదా
శ్యామ పలుకు ప్రతిమాటలొ తప్పేదీ లేదుకదా
మాటలోన తీపిదనము ఉండగానె సరికాదు
వెన్నవంటి మనసులేక ఫలమేదీ లేదుకదా
అలలుఎన్ని ఎగిసినా చేరేదీ తీరానికె
ఎంతో ఎత్తుకెదిగినా మమతేదీ లేదుకదా
ప్రేమన్నది అందమైన మేనితొడుగు జలతారు
ముసుగుతీసి తీరుచూడ మంచేదీ లేదుకదా
అమ్మ పంచు అనురాగం యెక్కడైన దొరకునా
అమ్మ చూపు కరుణకంటె గొప్పేదీలేదుకదా
ఆరుఋతువు లున్నగాని వసంతమే మేలవునూ
ఎవరైనా శిశిరాన్నీ కోరేదీ లేదుకదా
గజలులోన మహిమయేమొ రాయగాను తొందరించు
కొంతతడవు భరియించెడి శక్తేదీ లేదుకదా
రచన.. డా. శ్యామలగడ్డం....
No comments:
Post a Comment