గజల్ మహల్ 22...5-5-2016..రచన. డా. శ్యామలగడ్డం..
వానజల్లు కురియగానె మనసు ఝల్లుమన్నదిలే
మెరుపుతీగ ఎదురుపడగ పదముఝల్లుమన్నదిలే
విరి కన్నెల కన్నులలో వెన్నెలలే కదలాడగ
కలువభామ బాసలతో తనువు ఝల్లుమన్నదిలే
తుషారమే సడిసేయగ హుషారుగా తిరుగాడగ
ఉరుములతో చెలిచెంతకు అడుగు ఝల్లుమన్నదిలే
మూగభాష, సైగలతో చిరునవ్వులు కురిపించిన
నెలరాజూ ఫక్కుమనగ చూపుఝల్లుమన్నదిలే
కలల నీడ కదలాడగ పులకరింత పెరిగెనులే
శ్యామతోని మనువనగా వలపు ఝల్లుమన్నదిలే...
డా. శ్యామలగడ్డం
No comments:
Post a Comment