.
మనసులోని భావాలను పలికించిన సమయమిదే
కనులతోడ స్నేహరసము కురిపించిన సమయమిదే
కాచుకున్నపందాలూ , వేసుకున్న పరదాలూ
తొలగిపోయి త్వరత్వరగ, కలసిపొయిన సమయమిదే
ఆటలాడి, పాటపాడి మనసుదోచుకున్నహాయి
మరల,మరల తలచుకొనీ, పలికించిన సమయమిదే
చదువులలో పోటీలు, సెల్ఫీలలొ పోటీలు
సినిమాలకు, షికార్లకూ పరుగెత్తిన సమయమిదే
కాలమేమొ దౌడుతీయ పెంచుకున్న బంధాలు
త్రంచుకోను మనసురాక బిడియపడిన సమయమిదే
వెక్కిరింత, కొక్కిరింత, ఆప్యాయత, అనురాగం
ముప్పిరిగొన గడచిపోయి ,విడిపోయిన సమయమిదే
బాధ్యతలే లేని వయసు, చింతలేమి లేని మనసు
ఊహలకే రెక్కలిచ్చి పయనించిన సమయమిదే...
డా.శ్యామలగడ్డం.... 5-03-2016...
No comments:
Post a Comment