Friday, 7 October 2016

11. రాదోమరి..గజల్ 07-10-2016

గజల్ పూరణం
++++++++±±

శరత్కాల మేఘములో వెలుగెందుకు రాదోమరి
శిశిరములో పాదపమున ఆకెందుకు రాదోమరి

వసంతుడే తోడుండగ చిగురేయుట నిజమే మరి
వాసంత సమీరమే చల్లగెందుకు రాదోమరి

హేమంతపు గాలులలో ప్రేమ లేమొ మిళితమాయె
పచ్చదనపు తోటలలో మంచెందుకు రాదోమరి

గ్రీష్మతాపమోపలేక జంటలేమో విడివడగా
తాపమంత తీర్చగాను చినుకెందుకు రాదోమరి

వర్ష ఋతువు జాలిచూపె అవనిపైన ఓ శ్యామా
అలసినయెదలకు రాతిరి కునుకెందుకు రాదోమరి....

డా. శ్యామలగడ్డం....7-10-2016..

No comments:

Post a Comment