. దీపావళి
-------------------
దీపావళి సర్వ జనావళికి సమ్మోదమైన వేళ
నగరమంతా వెలుగులతో సమ్మోహనమైన వేళ
నరకాసుర దమనకాండ ముగిసిన వేళ
రావణాసురుని రాక్షసత్వం ఉడిగిన వేళ
కురుక్షేత్ర సంగ్రామంలో ధర్మం నిలిచిన వేళ
బలి చక్రవర్తి అహంకారం అణగారిన వేళ
ఆరోజే ఆనందోత్సాహాల దీపావళి!!!
క్షీరసాగర మధనంలో ఆదిలక్ష్మి అవతరించిన వేళ
విను వీధిలో సురోత్తములు సంతసమందిన వేళ
ఆ రోజే ఆనంద దీపావళి!!!
ఆనంద దీపావళి!!!
పెద్దలంతా పిల్లలుగా మారేవేళ
కన్నెల కన్నుల్లో కమనీయ కాంతులు మతాబుల్లా వెలిగిన వేళ
వృధ్ధుల వదనాలు తారాజువ్వలుగా మెరిసిన వేళ
యువకుల హృదయాలు లక్ష్మీబాంబులామారిన వేళ
ఇల్లాళ్ళ హృదయకమలాలు చిచ్చుబుడ్లలా విచ్చుకున్న వేళ
ఆ రోజే దీపావళి-- ఆరోజే దీపావళి!!!
ఉత్తుంగ తరంగాల్లా ఎగసిపడుతున్న ఆనందార్ణవ దీపావళి!!!
డా. జి. శ్యామల-------------13-09-2015 ( కవిత రాసినది-----2012
దీపావళి సందర్భంగా ఈ నా కవితను మళ్ళీ పోస్టు చేస్తున్నాను...11-11-2015
డా. శ్యామల గడ్డం...
No comments:
Post a Comment