Syamala Gaddam .(తృతీయం)
ఆలుమగలు ఒక్కటైతే ఆనందం
ఆరునెలల సావాసం వారువీరవుతారు (అలవాట్లలో) ఖాయం.
పిల్ల పాపలతో కళకళలాడే ఇల్లు శాంతినివాసం,..
అత్తమామలపై నీ గౌరవం, ఇచ్చును నీకే ఒక వరం
ఆడుబిడ్డలు ఆడేరు పరిహాసం...
శరదేందు చంద్రికల బోలిన నీ దరహాసం
తెలుపును సమ్మిళిత భావాల సమాహారం..
కోపమైనా, తాపమైనా, తీర్చును ఆ మందహాసం
ఎదిగిన కొద్దీ ఒదిగి ఉండే తత్వం
ఎగురవేయును కీర్తి పతాకం..
దైవ సన్నిధిలో మనసు ప్రశాంతం
తీయును నీకై మోక్షద్వారం...
కృష్ణాతరంగాలులోని పదవిన్యాస కవితలపోటీ కవిత.......
No comments:
Post a Comment