ఓటు
-------
ఓటంటే మాట కాదు
ఓటంటే నోటు కాదు
ఓటంటే పాట కాకూడదు
ఓటంటే కులాల కుమ్ములాటలసలే కాదు
ఓటంటే చేతివాటం కాదు
ఓటంటే లీటరు సారా కాదు
వేటు కావాలి సమాజంలోని దుర్మార్గంపై ఓటు
మనిషంటే మారేవాడు
మనిషంటే మార్పు కోరేవాడు
మనషంటే మనీ కోరేవాడు కాదు
మనిషంటే మంది మంచి కోరేవాడు
మనిషంటే మట్టి కాదు చైతన్యం
అలాంటి మనిషి కోరేదే సభ్య సమాజం
అలాంటి సమాజం కావాలి దేశ భవిష్యత్తుకు బాట
అలాంటి మనిషి వేసేదే నిజమైన ఓటు----
డా. జి. శ్యామల-------30-09-2015
-----------------------------------------
No comments:
Post a Comment