12-09-2015--
----------------
గోదావరి
----------
గల గలా పారింది గోదావరి
జల జలా ప్రవహించె గోదావరి
వెల్లువలా సాగింది గోగావరి
పొంగుతూ పొర్లింది గోదావరి
కృష్ణమ్మ ఒడి చేరె
కష్ట ఫలితమై వచ్చింది గోదావరి
తాడిపత్రిపై వచ్చింది గోదావరి
కష్టజీవులను కరుణించి వచ్చింది గోదావరి
పావన గంగగా వచ్చింది గోదావరి
వంకర్లు తిరుగుతూ వచ్చింది గోదావరి
నేలతల్లినీ తడపంగ వచ్చింది గోదావరి
పంటలను పండించ వచ్చింది గోదావరి...........డా. జి. శ్యామల.......
No comments:
Post a Comment