గజల్ చిత్రం..21.. రచన.డా.శ్యామల గడ్డం...15-05-2017...
తెలుగింటిలొ ఆడపడుచు నిలిచినట్లు ఉందేమిటి..
స్వచ్ఛమైన మల్లె పువ్వు విచ్చినట్లు ఉందేమిటి..
సంబరాల జాతరేదొ వదనమందు కదలాడగ..
అంబరాన వెలుగుచుక్క పూసినట్లు ఉందేమిటి..
చిరునవ్వుల ముత్యాలను ఏరుకొనుట అసాధ్యమే.
హాసములే వరములుగా ఇచ్చినట్లు ఉందేమిటి..
బావరాక వర్తమానమందెనేమొ లేఖలోన..
పరవశమే హృదయాన్నీ తాకినట్లు ఉందేమిటి..
చిత్తరువుగ నిలుచుండగ భావమేమి మదిలోనా
చిత్రముగా మూగప్రేమ ముసిరినట్లు ఉందేమిటి...
నీ హృదిలో భావాలూ శ్యామతోన పంచుకోవ..
పలుక గాను నునుసిగ్గులు పొరలినట్లు ఉందేమిటి...
డాక్టర్.శ్యామల గడ్డం...
No comments:
Post a Comment