ఏలల దరువుల నడిమిన జనపదమై జన్మించిన తెలుగు కాంత
నన్నయ్య ఇంట కూతురైనది ముద్దులొలుకుతు తెలుగు కాంత
తిక్కన తియ్యనైన తెలుగు మాటల పూదోటలో పరిమళించు పూవైనది తెలుగుకాంత
ప్రబంధ పరమేశ్వరునితో పంతమాడి కీర్తికాంతయైనది
తెలుగుకాంత
పల్లెపూపొదరిండ్లలో ముద్దుపలుకులతోడ ముదమార శ్రీనాధ కవితకాగ
ఆటపాటగ, కనులకింపుకాగ, మాటలమందారమైనది
పోతన కవితలోన
ముగ్ధ మనోహర రూపమై రమణీయ రాగమై రతనాలసీమలో రాజసముగ
తనతనూవిలాసలతికలతో శింజినీ నాదమై నాట్యమాడెను కృష్ణరాయలింట
ముగ్ధయై, ప్రౌఢయై, ప్రాయంపు కాంతయై, అలకల దేవేరియై అలరించె అలనాటి తెలుగుకాంత
కిన్నెరసానియై,ఊర్వశియై,బాపూబొమ్మయై నడయాడె తెలుగుకాంత
కాలికి గజ్జె కట్టి ఉద్యమగీతమై రాష్ట్రావతరణ సారధియై
సవ్యసాచియైనది తెలుగుకాంత
కవితయై,కావ్యమై కథగాయై, గజలై ఏకవాక్యమై,నవలై చిట్టి కవితలై పొట్టి కవితలై చిత్ర కవితలై, నానీలై నానోలై
హొయలొలుకుతు కులుకుతున్నది తెలుగుకాంత........
డా. జి. శ్యామల.... 31-07-2018
No comments:
Post a Comment