భావసుధాచంద్రికలు...మిథున కవితా వనం...
+++++±±±++++++++++++++++++++++++
పాఠశాలలు ప్రారంభమైనాయి..
తరువాత తరగతిలోకి వెళతామన్న.
ఉత్సాహాన్నీ, ఉల్లాసాన్నీ నింపుకుని..
పరుగులాంటి నడకతో, ఉద్వేగంగా..
మిత్రులను కలుసుకున్న ఆనందంతో..
కదులుతున్న చదువరులారా..
చదువే సర్వస్వమై, విఙ్ఞాన కుసుమాలు ఏరుకుంటూ...
నీతి, నిజాయితీ దారంతో దండ గుచ్చి,
విరించి రాణి మెడలో వేద్దామనా!
బయలుదేరారు?
కొత్త విద్యా సంవత్సరంలో సరికొత్త సంకల్పం..
చేపట్టి, ఆశయాల ఆమనిలో విహరిద్దామని.
సాధకులై, పాంథులై బయలుదేరారా విద్యార్ధులారా!!!
కూటికి పేదవైనా, గుణానికి పెద్దవై, ..
విద్యాలక్ష్మిని వెంటనిడుకుని..
ప్రపంచ పాఠశాలలో బ్రతుకు నేర్పే..
పాఠాలను నేర్చుకుంటూ.....
జీవితం గమ్యాన్ని చేరుకుంటూ..
జీవన సాఫల్యాన్ని. పొందుతావుగా....
ఇంకా నీకేమి తక్కువ...
మహిళా మహరాణివి నువ్వే....
డాక్టర్.శ్యామలగడ్డం....23-05_2017.....
మీ కవితలు బాగున్నాయి మా ప్రతిలిపికి పంపండి.వివరాలకు 7259511956 కాల్ చేయండి.
ReplyDelete